Bahubali - Sharuh Khan words about Bahubali

బాక్సాఫీస్‌ వద్ద అనేక రికార్డులను సృష్టించి, దక్షిణాది సినిమాను అంతర్జాతీయ యవనికపై సగర్వంగా నిలిపిన ‘బాహుబలి’ చిత్రాని బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘‘సినిమా కోసం ఎంత కష్టపడాలో ‘బాహుబలి’ చూపించింది. ఇలాంటి స్ఫూర్తిదాయక చిత్రాన్ని రూపొందించడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సవాలును ఎదుర్కోడానికి ఇష్టపడినప్పుడే ఆకాశాన్ని అందుకోగలుగుతారు’’ అని ఆయన ట్వీట్‌ చేశాడు. బల్గేరియాలో సొంత సినిమా ‘దిల్‌వాలే’ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని ముంబై వచ్చిన ఆయన తన పిల్లలతో కలిసి ‘బాహుబలి’ని వీక్షించాడు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ‘బాహుబలి’ రూ. 300 కోట్ల క్లబ్బులో చేరిన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచి చరిత్రకెక్కింది.

Anonymous

Unknown

Some say he’s half man half fish, others say he’s more of a seventy/thirty split. Either way he’s a fishy bastard.

0 comments: