Srimanthudu - puri jagannath is eagerly waiting for srimanthudu

‘‘మహేశ్‌ సినిమా విడుదలవుతుంటే నాకే కాదు, అందరికీ ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. మహేశ్‌తో పనిచేయడం డైరెక్టర్లకు కిక్‌నిస్తుంది. డైరెక్టర్లకు ప్రేరణనిచ్చే హీరో మహేశ్‌’’ అని పొగడ్తల జల్లు కురిపించారు టాప్‌ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్‌. మహేశ్‌తో ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’ వంటి హిట్‌ సినిమాలను రూపొందించిన ఆయన ‘శ్రీమంతుడు’ గురించి మాట్లాడుతూ ‘‘నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘శ్రీమంతుడు’. ఎందుకంటే మా కృష్ణగారబ్బాయి, మా మహేశ్‌ నటించిన సినిమా ఇది. ఈ సినిమా డైరెక్టర్‌ శివ ఎప్పుడు కలిసినా మహేశ్‌ గురించే మాట్లాడుతుంటాడు. నా ఫ్రెండయిన అతను మహేశ్‌తో పనిచేయడం వెరీ హ్యాపీ. తనకి ఈ సినిమా చాలా పెద్ద హిట్‌నివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మా డార్లింగ్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన ఆడియో విన్నాను. ఫెంటాస్టిక్‌గా ఉంది. ఈ సినిమాలో ‘ఎవ్వడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుద్దో.. ఆడే నా మొగుడు’ అనే పాట చేశాడు. ఆ మొగుడి కోసం నేనూ వెయిట్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు. మహేశ్‌, శ్రుతి హాసన్‌ జంటగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. సంయుక్తంగా నిర్మించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఈ నెల 7న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది.

Anonymous

Unknown

Some say he’s half man half fish, others say he’s more of a seventy/thirty split. Either way he’s a fishy bastard.

0 comments: