నాగ బాబు మాటలకు స్పందించిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ 60వ పుట్టినరోజును శుక్రవారం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, మెగా అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో చిరంజీవి జన్మదిన వేడుక ఘనంగా జరిగింది. అయితే మెగా కుటుబంలో జరిగే ఏ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలిసినప్పటికీ పవన్ ఎక్కడ..పవర్ స్టార్ రావాలి అంటూ అరుపులు, కేకలతో కార్యక్రమంలో గందరగోళం సృష్టిస్తారు. నిన్న జరిగిన చిరు పుట్టినరోజు వేడుకలో కూడా అదే జరిగింది.

కానీ..ఈసారి నాగ బాబు పవన్ అభిమానులకు ఘాటైన సమాధానం ఇచ్చాడు. ‘మేము ఎన్నిసార్లు పిలిచినా పవన్ రాడు..మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర అరవండి. అంతేకానీ ఇలా పవన్ కళ్యాన్ రాణి కార్యక్రమాల్లో అరుస్తూ ఇబ్బంది పెట్టకండి’ అని నాగబాబు స్పష్టం చేసాడు.  నాగబాబు మాటలకు పవన్ స్పందించి గుజరాత్ లో జరుగుతున్న ‘సర్దార్’ షూటింగ్ ని రద్దు చేసుకొని నేడు హైదరాబాద్ లోని పార్క్ హయాత్ లో జరగనున్న చిరంజీవి పుట్టినరోజు వేడుకకు హాజరుకానున్నాడు

Unknown

Some say he’s half man half fish, others say he’s more of a seventy/thirty split. Either way he’s a fishy bastard.

1 comment: